గంజాయి ముఠా అరెస్ట్
2.5 కేజీల నిషేధిత గంజాయి స్వాధీనం నందిపేట్, బతుకమ్మ: నందిపేట్ పరిధిలో అక్రమంగా గంజాయి రవాణా జరుగుతోందన్న సమాచారంపై అర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి దిశానిర్దేశంలో, నందిపేట్ ఎస్‌ఐ చిరంజీవి ఆధ్వర్యంలో ఆదివారం పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా, వెల్మల్ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా స్కూటీపై వస్తున్న ఇద్దరిని ఆపి పరిశీలించగా, వారి వద్ద 2.5 కేజీల నిషేధిత గంజాయి బయటపడింది. గంజాయిని, స్కూటీని, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ప్రధాన నిందితుడు...