Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 January 2026, 12:11 pm Posted by : ramakrishna

టి జి న్యాబ్ కి చిక్కిన గాంజా వాల మునావర్

 

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నిజామాబాద్ జిల్లాలో గంజాయి దందా పీడీ యాక్ట్ నమోదైన గాంజవాల మునవార్ ను టిజి న్యాబ్ టీం అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. నిజామాబాద్ నగరానికి చెందిన మునవార్ పై గత ఎడాది ఖమ్మం జిల్లాలో గంజాయి రవాణాకు సంబంధించి కేసు నమోదు అయింది. అనాటి నుంచి మునవార్ ఫరారిలొ ఉన్నాడు. గత కొంత కాలంగా టిజి న్యాబ్ అతని కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టింది. రెండు రోజుల క్రితం అతడిని పక్క సమాచారంతో నగరంలోని పులాంగ్ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అతడిని వరంగల్ టిజి న్యాబ్ టీం అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించినట్లు సమాచారం. నిజామాబాద్ టిజి న్యాబ్ అధికారులు ధ్రువికరించడం లేదు.. మజ్లీస్ పార్టిలో నాయకుడిగా ఉన్న మునావర్ గంజాయి దందాను నిరాటకంగా సాగిస్తుండటంతో అతనిపై కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అంతే గాకుండా పలు కేసులలో కోర్టుకు హజరు కాకపోవడంతో నాన్ బెయిలేబుల్ వారంట్స్ ఉన్నట్టు సమాచారం.

Ganja dealer Munawar caught by TG NYAB