. . . తెలంగాణ రైతు కూలి సంఘం రాష్ట్ర కోశాధికారి బామండ్ల రవీంధర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
ప్రభుత్వం ప్రజలపై ఏ భారం మోపిన దానికి వ్యతిరేకంగా నిరంతరం ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు చేపడుతూ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు నర్సన్న అని తెలంగాణ రైతు కూలి సంఘం రాష్ట్ర కోశాధికారి బామండ్ల రవీంధర్ అన్నారు. సీపీఐ (ఎంఎల్) రాష్ట్ర నాయకులు గంగుల నర్సన్న రెండవ వర్థంతి సందర్భంగా మాధవ నగర్ లోని కామ్రేడ్ గంగుల నర్సన్న కాలనీలో శనివారం వర్థంతి సభ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రవీంధర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ నర్సన్న అతి చిన్న వయసులో ఎర్రజెండా చేతబట్టి దొరల గడిలపై జెండా పాతి నాటీ నుండి అమరులు అయ్యేంత వరకు విప్లవ ఉద్యమాలలొ పనిచేసాడన్నారు. జిల్లా సెంటర్ లోని నాలుగవ డివిజన్ మాధవ నగర్ లో పేద ప్రజలకు సుమారు ఒక 100 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇప్పించడం జరిగిందని, ఉద్యమంలో ఉన్నంత కాలం రైతాంగం కోసం పేద ప్రజల కోసం అలుపెరుగని పోరాటం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి భామండ్ల రవీందర్, నరసన్న కూతుర్లు బిందు, మానస, తెలంగాణ రైతు కూలి సంఘం జిల్లా నాయకులు పల్లె మల్లేష్, కత్తుల మారుతి, సత్యనారాయణ గారబోయిన శంకర్, కొండ అనూషవ్వ, రజియా, పల్ల దుర్గయ్య, కొంతం యాది మల్లన్న, బిక్షపతి, లక్ష్మణ్, మహిళలు అన్నం అనిత, రుక్కవ్వ, మంజుల, సిద్ధవ్వ తదితరులు పాల్గొన్నారు.
