. . . డబ్బుల ఆశతో ఖాతాలు అప్పగిస్తే మీకూ చిక్కులు
వెబ్ డెస్క్, బతుకమ్మ :
దుబాయ్‌లో ప్రజల బ్యాంక్ ఖాతాలను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యవస్థీకృత గ్యాంగ్‌ను దుబాయ్ పోలీసులు పట్టుకున్నారు.ఈ గ్యాంగ్ ముఖ్యంగా డబ్బు అవసరమైన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంది. వారి పేర్లపై బ్యాంక్ ఖాతాలు, డిజిటల్ వాలెట్లు తెరిస్తే డబ్బులు ఇస్తామని ఆశ చూపించింది. ఖాతాలు తెరిచిన తర్వాత, వాటి లాగిన్ వివరాలు, యాక్సెస్‌ను తమకు అప్పగించాలని వారిని ఒప్పించింది. ఆ తర్వాత ఆ ఖాతాలను ఉపయోగించి మోసాల ద్వారా వచ్చిన డబ్బును బదిలీ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.ఇతరుల పేర్లపై ఉన్న ఖాతాలను ఉపయోగించడం ద్వారా అసలు నేరస్థుల వివరాలు, డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాలను దాచేందుకు గ్యాంగ్ ప్రయత్నించింది. దుబాయ్ పోలీసుల క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం నిఘా, దర్యాప్తు ద్వారా ఈ నెట్‌వర్క్‌ను గుర్తించి, గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేసింది.పోలీసుల హెచ్చరిక: డబ్బుల ఆశతో మీ పేరుపై బ్యాంక్ ఖాతా లేదా డిజిటల్ వాలెట్ తెరిచి ఇతరులకు అప్పగించవద్దు. మీ ఖాతా మోసాలకు లేదా మనీలాండరింగ్‌కు ఉపయోగిస్తే మీకూ చట్టపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి అనుమానాస్పద ఆఫర్లు వస్తే Dubai Police eCrime ప్లాట్‌ఫామ్, Police Eye లేదా 901 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.