. . . ఐదు ఆటోలు స్వాధీనం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలో ఆటోలలో ప్రయాణికులను ఎక్కించుకొని వారి జేబులు కట్ చేసి నగదు, మొబైల్ ఫోన్లు దొంగిలిస్తున్న ఎనిమిది మంది సభ్యుల ముఠాలో ఆరుగురిని అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు 1వ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు. షేక్ సలీమ్, షేక్ సద్దాం, షేక్ ఇమ్రాన్, షేక్ నయీం, సయ్యద్ వసీం, పాషా, సయ్యద్, వహాబ్ లు ముఠా గా ఏర్పడి ఆటోలల్లో తిరుగుతూ నగరంలోని బస్టాండ్, మాలపల్లి, ఖలీల్‌వాడి, ఆర్యనగర్ ప్రాంతాలలో ఒంటరిగా ఉన్న ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకొని మార్గ మధ్యంలో హడావిడి చేసి వారి జేబులను బ్లేడ్‌తో కట్ చేసి నగదు, మొబైల్ ఫోన్లు దొంగిలించి పారిపోయే వారన్నారు. అరెస్టు చేసిన నిందితులు పలు సంఘటనల్లో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారన్నారు. వారి వద్ద నుంచి రూ.500 నగదు, ఫోల్డబుల్ బ్లేడ్, 2 కీప్యాడ్ మొబైల్ ఫోన్లు, 5 ఆటోలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించగా, వివిధ కేసులల్లో దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఎవరైనా ఇలాంటి ఘటనలకు గురైతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.