Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 May 2026, 8:07 pm Posted by : ramakrishna

ఒంటరి వ్యక్తులను దోచే ముఠా అరెస్టు

 

. . . విదేశి కరెన్సీ,  సెల్ ఫోన్స్ స్వాధీనం

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి పట్టణంలో రాత్రి పూట ఒంటరిగా వెళ్లేవారిని లక్ష్యంగా చేసుకుని దోపిడిలకు పాల్పడుతున్న ఐదుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు కామారెడ్డి పట్టణ సిఐ నరహరీ తెలిపారు. శుక్రవారం పట్టణ సిఐ నరహరి విలేకరులతో మాట్లాడుతు ఈ నెల 18 న కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ నగర్ లో ఒంటరిగా వెలుతున్న ఒక వ్యక్తిని ఐదుగురు సభ్యుల ముఠా అటకాయించి, బెదిరించి రూ.4 వేలు, 300 దుబాయ్ దిరమ్స్ లు దోచుకున్నారు. అంతే కాకుండా బాధితుడి మొబైల్ లోని యాప్ ద్వారా వెయ్యి నగదును యూపిఐ చేయించుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సాంకేతిక ఆధారాలతో పట్టణంలో సంచరిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పట్టుకున్నారు. అందులో ఒకరు మైనర్ కాగా వారి వద్ద నుంచి రూ.8,300 నగదు, నాలుగు సెల్ ఫోన్ లు, 300 దుబాయ్ దిరమ్స్ తో పాటు యాక్టివా స్కూటర్ ను సీజ్ చేసినట్లు తెలిపారు. ఐదుగురిలో నలుగురిని రిమాండ్ కు, మైనర్ ను జువైనల్ హోంకు తరలించినట్లు తెలిపారు.