అంతర్రాష్ట్ర ట్రాన్స్ ఫార్మర్ కాయిల్స్ దొంగల ముఠా అరెస్ట్
నిజామాబాద్ క్రైమ్, బతుకమ్మ : అంతర్రాష్ట్ర ట్రాన్స్‌ఫార్మర్ కాయిల్స్ దోపిడీ ముఠాను ఇందల్వాయి వద్ద పట్టుకొని 40 కిలోల కాపర్ కాయిల్స్, రూ.5.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు... ఆదివారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు. గత సంవత్సరం కాలం నుంచి నిజామాబాద్ జిల్లా లోని ఇందల్వాయి, ధర్పల్లి, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, మెండోరా, ముప్కాల్, మోర్తాడ్, మోపాల్, బోధన్ టౌన్, బోధన్ రూరల్, నవీపేట్, వర్ని, మండలాల్లో...