జాతీయ రహదారులపై లారీలను దోచే ముఠా సభ్యుల అరెస్టు
కామారెడ్డి, బతుకమ్మ : జాతీయ రహదారులపై రన్నింగ్ లారీలను టార్గెట్ చేసి కట్టర్ లతో సీల్ ఓపెన్ చేసి చోరిలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గత నెల 44వ జాతీయ రహదారిపై కామారెడ్డి పట్టణ శివారులోని టేక్రియల్ వద్ద కొందరు అగంతకులు కంటైనర్ నుంచి రూ.10 లక్షల విలువ చేసే సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు....