కామారెడ్డి, బతుకమ్మ :
జాతీయ రహదారులపై రన్నింగ్ లారీలను టార్గెట్ చేసి కట్టర్ లతో సీల్ ఓపెన్ చేసి చోరిలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గత నెల 44వ జాతీయ రహదారిపై కామారెడ్డి పట్టణ శివారులోని టేక్రియల్ వద్ద కొందరు అగంతకులు కంటైనర్ నుంచి రూ.10 లక్షల విలువ చేసే సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు. ఈ కేసు విచారణలో భాగంగా రెండు టీంల ఆధ్వర్యంలో దొంగల ముఠా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అందులో ఒక బ`దం మధ్యప్రదేశ్ కు చెందిన రీతిక్ ఝాన్ జా, మాల్వియా దీపక్ కుమార్, దేవిసింగ్ సిపోడియాలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఒక బైక్, ఒక చాకు, ఒక కట్టర్ ను, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.ఈ విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, కామారెడ్డి రూరల్ సిఐ రామన్, మాచారెడ్డి దేవునిపల్లి ఎస్సై అనిల్, రంజిత్ లు పాల్గొన్నారు.
