Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 April 2025, 9:56 pm Posted by : ramakrishna

గల్ఫ్ లో ఉపాధి పేరిట చీటింగ్ చేస్తున్న ముఠా అరెస్ట్

  • ఉపాధి కల్పించకుండానే క్రేడిట్ కార్డులు తీసుకుని పర్సనల్ లోన్లు తీసుకుని మోసాలు
  • శ్రీదేవి ట్రావెల్ యజమాని బిజ్జం సుబ్బారెడ్డి అరెస్టు
  • గల్ఫ్ పంపిస్తామని మోసాలకు పాల్పడుతున్న భార్యాభర్తలు
  • 70 మంది యువతను మోసం చేసిన ముఠా
  • ముగ్గురి అరెస్టు.. పరారీలో మరో ముగ్గురు

 

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  గల్ప్ దేశాలలో హై ప్రొఫైల్ కంపనీలలో, హై ప్రొఫైల్ జాబులు ఇప్పిస్తామని జిల్లాలో 70 మందికి పైగా నిరుద్యోగ యువత వద్ద 5 లక్షల నుంచి 7 లక్షల వరకు తీసుకుని ఎలాంటి ఉద్యోగాలు ఇప్పించకుండానే, బాధితుల పేర్ల మీదా క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు తీసుకుని మోసాలకు పాల్పడుతున్న ఘరానా ముఠాకు చెక్ పెట్టారు నిజామాబాద్ పోలీసులు.  దుబాయ్ లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసగిస్తున్నముఠాలో ముగ్గురిని అరెస్టు చేసామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నారని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీ దేవి ట్రావేల్ యాజమాని బిజ్జం సుబ్బారెడ్డితో పాటు దుండిగల్ స్వప్న అలియాస్ పబ్బ స్వప్నలను శనివారం అరెస్టు చేసినట్లు మరో ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ పోలీస్ స్టేషన్ లో అన్నారం గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదులో భాగంగా సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ నాగేంద్రచారీ, నందిపేట్ ఎస్ఐ చిరంజీవి ఆదేశాల మేరకు చీటింగ్, ఇమిగ్రేషన్ యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులో భాగంగా దోందిగల భూమేష్ అలియాస్ పబ్బ భూమేష్ రెడ్డి తో పాటు అతని భార్య పబ్బ స్వప్న, నందిపేట్ కు చెందిన అరుగుల బోజరాం, మోచరాజులతో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీదేవి ట్రావెల్ యాజమాని బిజ్జం సుబ్బారెడ్డి తో పాటు ఆర్మూర్ లో ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న ఆరేపల్లి మహేష్ లపై కేసు నమోదైంది. ఆరుగురు ఒక ముఠాగా ఏర్పడి దుబాయ్ లో మంచి కంపనీలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆయా కంపేనీలకు జనరల్ మేనేజర్లు, పైనాన్స్ మెనేజర్లుగా చెప్పుకుంటు యువతను నమ్మించారు. అ ముఠా మాటలను నమ్మి జిల్లాలో సుమారు 70  మంది యువత వారికి రూ.6 లక్షల వరకు చెల్లించారు. డబ్బులు తీసుకున్న ముఠా నిరుద్యోగ యువతను దుబాయ్ లో హై ప్రోపైల్ కంపెనీలలో, హై ప్రోపైల్ జాబులు అంటు అక్కడికి పంపించి వారి పేర్ల మీద క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్ లు తీసుకుని ఒక్కొక్కరి పేరు మీదా రూ.30 లక్షల వరకు తిరిగి ఇచ్చి పంపుతామని నమ్మించారు. తీరా దుబాయ్ కు వెళ్లిన తరువాత ఎలాంటి ఉద్యోగాలు చూపించకుండానే ఆరు నెలలకు బెదిరించి ఇండియాకు పంపించేవారు. ఈ కేసులో ఈ నెల 12న అరుగుల బోజరాంను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించగా శనివారం పబ్బ స్వప్నను, బిజ్జం సుబ్బారెడ్డిలను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.  పబ్బ భూమేష్ రెడ్డితో పాటు అరెపల్లి మహేష్, మోచరాజులు పరారీలో ఉన్నారని వారిని త్వరలో పట్టుకుంటామని సిపి తెలిపారు. యువత ఎవరు కూడా నకిలీ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని ఎవరైనా బాధితులు ఉన్నట్లయితే న్యాయ సహాయం కోసం పోలీస్ వారిని సంప్రదించాలని నిజామాబాద్ పోలీస్ కమీషనర్  పి. సాయి చైతన్య తెలియజేశారు.