చిట్టి చేతులలో రూపుదిద్దుకున్న వినాయకులు
మోర్తాడ్, బతుకమ్మ: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొండి మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో గల ప్రైమరీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తమ చిట్టి చేతులతో వినాయకులను అందంగా సుందరంగా తయారు చేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రమీల మాట్లాడుతూ మట్టి గణపతులనే ప్రతిష్టించి పర్యావరణాన్ని పరిరక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు పోటీపడుతూ సుందరంగా వినాయక ప్రతిమలను తయారు చేశారు.