జోరుగా సాగుతున్న వినాయక నిమజ్జనం

హైదరాబాద్, బతుకమ్మ :   హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనం జోరుగా సాగుతోంది. వేలాది విగ్రహాలు నిమజ్జనానికి బయలుదేరాయి. నగరంలో దాదాపు 50 వేల విగ్రహాలు నిమజ్జనం చేస్తారని అధికారులు అంచనా వేశారు. దీంతో అధికారులు, పోలీసులు ఎలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. 30 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. వినాయక విగ్రహాలు వెళ్లే మార్గంలో ఇతర వాహనాల​ను అనుమతించడం లేదు. నగరంలో ఆదివారం రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్​ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. నగరంలోకి లారీలకు...