Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 September 2024, 3:07 pm Posted by : ramakrishna

గణేశ్ శోభాయాత్ర రూట్ పరిశీలన

కామారెడ్డి, బతుకమ్మ : గణేశ్ నిమజ్జన శోభాయాత్ర కొనసాగనున్న రూట్ ను జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ సింధూశర్మ బుధవారం పరిశీలించారు. స్టేషన్ రోడ్డు, గంజ్ రోడ్డు, పెద్ద బజార్, నిజాంసాగర్ చౌరస్తా మీదుగా కొత్త బస్టాండ్, ఇందిరాగాంధీ స్టేడియం వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న విద్యుత్ తీగలను సరి చేయాలని విద్యుత్, మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువు వరకు శోభాయాత్ర రూట్ ను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ.. పెద్ద చెరువు వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని మున్సిపల్, పోలీసు అధికారులకు సూచించారు. గణేష్ మండపాల వారు జనరేటర్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలన్నారు. వారివెంట మున్సిపల్ చైర్ పర్సన్ ఇందుప్రియ, ఎస్సైలు, మున్సిపల్ అధికారులు తదితరులున్నారు.