Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 6:21 pm Posted by : ramakrishna

గణేష్ నవరాత్రులు భక్తి శ్రద్దలతో శాంతియుతంగా నిర్వహించుకోవాలి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

నిజామాబాద్ నగరంలో వినాయక చవితి, గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని గణేష్ మండలి నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నగర మేయర్ కూరగాయల ఉమారాణి, ఏసీపి ప్రకాష్, 2వ టౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ యాదగిరిలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నగర మేయర్ కూరగాయల ఉమారాణి రమేష్ గణేష్ మండలి నిర్వాహకులను ఉద్దేశించి మాట్లాడుతూ గణేష్ నవరాత్రులను భక్తి శ్రద్ధలతో, శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించారు.ఉత్సవాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ సహకరించాలని, పోలీసు అధికారులు ఇచ్చే మార్గదర్శకాలను పాటించాలని కోరారు.పోలీసు అధికారులు కూడా ఉత్సవాల సమయంలో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ధ్వని వ్యవస్థల పరిమితులు, ఇతర నిబంధనల గురించి మండలి నిర్వాహకులకు వివరించారు. అందరూ సహకారంతో ఉత్సవాలు విజయవంతంగా జరగాలని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు,వివిధ గణేష్ మండలి నిర్వాహకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.