Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 September 2024, 1:18 pm Posted by : ramakrishna

లండన్ లో భక్తి శ్రద్ధలతో గణేష్ నిమజ్జనం

నగరానికి చెందిన మెడిచేట్టి నరేష్ అధ్వర్యంలో వేడుకలు

. . .లడ్డును  వేలం లో 501 పౌండ్లకు దక్కించుకున్న కరీంనగర్ కి చెందిన రక్షిత పటేల్

బతుకమ్మ , ప్రత్యేక ప్రతినిధి :

 

యూకేలోని లండన్ లో గణేష్ పండుగ ఉత్సవాలను ప్రవాస భారతీయులు ఘనంగా జరుపుకున్నారు. నవరాత్రుల్లో  గణనాథునికి భారతీయ సాంప్రదాయ పద్ధతిలో ప్రతి రోజూ శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు నిత్య అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. చివరి రోజు శనివారం రాత్రి గణేష్ నిమజ్జనం భారీ ర్యాలీ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. స్వదేశంలో లాగా లండన్ పురవీధుల్లో పోలీసు ప్రోటెక్షన్ తో గణేష్ విగ్రహాన్ని టాప్ లేని వాహనంలో ఊరేగించారు. డిజే సౌండ్ సిస్టంతో ఆటాపాటలు,డాన్సులు చేస్తూ, డప్పు వాయిద్యాలతో, టపాసులు పేలుస్తూ కన్నుల పండువగా 200 మంది ప్రవాస భారతీయులతో కలిసి భారీ నిమజ్జనం ర్యాలీ నిర్వహించారు.లండన్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ నరేష్ మెడిచేట్టి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను లండన్ లో ఉన్నటువంటి ప్రవాస భారతీయులందరూ కలిసి కుల మత బేధాలు లేకుండా ఒక దగ్గరికి చేరి గణేష్ పండుగను ఘనంగా జరుపుకోవడం విశేషం.

Ganesh Namazjanam is a huge rally of expatriate Indians in London

తోమ్మిది రోజుల పాటు పుజలు అందుకున్న గణ నాథుడి వద్ధ ఉన్న లడ్డును కరీంనగర్ కి చెందిన అద్దండి రక్షిత పటేల్ లడ్డూ వేలం పాటలో 501 పౌండ్లకు (  ఇండియన్ కరేన్సీలో రూ. 55,000) దక్కించుకుంది. ఈ సందర్బంగా గణేష్ ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ నిజామాబాద్ నగరానికి చెందిన మెడిచేట్టి నరేష్ మాట్లాడుతూ మనం ఎక్కడ ఉన్న మన సప్రదాయాలను పాటిస్తూనే ఉండాలని, ఎక్కడ ఉన్నా కులాలు మతాలకు అతీతంగా పండుగలు జరుపుకుంటున్నామన్నారు. ఇండియాలోనే కాకుండా లండన్ లో కూడా మన సాంప్రదాయాలను గౌరవించి మాకు అన్ని విధాలా అండగా నిలబడిన అందరికి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మహమ్మద్ ముస్సాదిక్, భరత్, విజయ్, సహానా, రక్షిత , ఉషా, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

 

Ganesh Namazjanam is a huge rally of expatriate Indians in London