Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 September 2024, 7:46 pm Posted by : ramakrishna

గణేష్ నిమజ్జనాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలి

. . . నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలించిన కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్

బతుకమ్మ, కామారెడ్డి :  గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో సామరస్య పూర్వకంగా నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ అన్నారు. మంగళవారం అడ్లూర్ ఎల్లారెడ్డి (టెక్రియాల్ సమీపంలోని) చెరువులో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం క్రమపద్ధతిలో, సమన్వయంతో సామరస్య పూర్వకంగా నిర్వహించుకోవాలని అన్నారు. నీటి ప్రవాహంలో ఎవరిని అనుమతించకూడదని, క్రేన్ లో సహాయంతో విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. రాత్రి వేళల్లో లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలని, పోలీసు బందోబస్తు నిర్వహించాలని అన్నారు. గజ ఈతగాళ్లను అప్రమత్తంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ హిందూ ప్రియ,మున్సిపల్ కమిషనర్ సుజాత,ఇతర మున్సిపల్, పోలీసు, ఫైర్, మత్స్య శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Ganesh immersion should be performed with devotion