ఘనంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలం చిక్కడపల్లి గ్రామంలో గురువారం గణేష్ నిమజ్జన శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భజనలు కీర్తనలతో ప్రధాన వీధుల గుండా గణేష్ నిమజ్జన శోభయాత్ర కొనసాగింది. అనంతరం గ్రామ శివారులోని చెరువులో గణేష్ నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ మండలి సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.