Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 September 2025, 4:40 pm Posted by : ramakrishna

ఘనంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర

రుద్రూర్, బతుకమ్మ : గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రుద్రూర్ మండలం సులుమ నగర్ గ్రామంలో శుక్రవారం ఉదయం గణేష్ నిమజ్జన శోభాయాత్రను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భజనలు, కీర్తనలతో ప్రధాన వీధుల గుండా శోభయాత్ర కొనసాగింది. ఈ శోభయాత్రలో సులమన్ నగర్ మాజీ సర్పంచ్ షేక్ ఖాదర్, గణేష్ మండలి సభ్యులు వడ్ల సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.