Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 10:12 am Posted by : ramakrishna

కామారెడ్డి లో ప్రారంభమైన గణేష్ నిమజ్జనం

 

. . . ప్రారంభించిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి, బతుకమ్మ :

కామారెడ్డి లో తొమ్మిది రోజుల పాటు పూజలంధుకున్న గణనాథు లు నిమజ్జనం ప్రారంభమైంది. బుధవారం రాత్రి కామారెడ్డి రైల్వే స్టేషన్ వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో సాగింది. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పాల్గొని కామారెడ్డి రైల్వే స్టేషన్ వద్ద గణనాథునికి కొబ్బరికాయ కొట్టి, ప్రత్యేక పూజలు చేసి నిమజ్జన శోభాయాత్రను ఘనంగా ప్రారంభించారు.
అనంతరం నిమజ్జన ఊరేగింపులో పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడానికి జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ కలసి అన్ని పటిష్ట ఏర్పాట్లు చేశాయని చెప్పారు. ప్రజలంతా శాంతియుతంగా పాల్గొని అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి, అదనపు ఎస్పీ కే. నరసింహారెడ్డి, డీఎస్పీ ఎస్. మధుసూదన్, సీఐ నరహరి, ఇతర అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Ganesh immersion begins in Kamareddy.
Ganesh immersion begins in Kamareddy.