Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 August 2025, 3:18 pm Posted by : ramakrishna

గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి

  • బోధన్ ఏసీపి శ్రీనివాస్

 

రుద్రూర్, బతుకమ్మ : గణేష్ ఉత్సవలను  శాంతియుతంగా జరుపుకోవాలని బోధన్ ఏసీపి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం రుద్రూర్ మండల కేంద్రంలోని శశిరేఖ గార్డెన్ లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్, సీఐ కృష్ణలు మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా శాంతియుతంగా  జరుకోవాలన్నారు. గణేష్ మండపాల వద్ద నియమ నిబంధనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ ఎస్సై సాయన్న, తహసీల్దార్ తారాబాయి, విద్యుత్ ఏఈ శ్రీనివాస్, మండల నాయకులు, గణేష్ మండపాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.