గణేష్ చతుర్థితో దేశంలో రూ.45000 కోట్ల బిజినెస్
హైదరాబాద్, బతుకమ్మ : గణేష్ చతుర్థి అంటే కేవలం భక్తి, సంతోషాల పండుగ మాత్రమే కాదు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ఓ అద్భుతమైన ఉత్సవమని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ తెలిపింది. ఈ పండుగ ద్వారా ఈ ఏడాది వేల కోట్ల వ్యాపారం జరిగినట్లు చెప్పింది. దేశంలో గణేష్ చతుర్థి అంటే రంగు రంగుల పందిళ్లు, డీజే మోతలు, భక్తితో కూడిన ఉత్సాహం గుర్తుకొస్తాయి. కానీ ఈ పండగ కేవలం భక్తి, సంస్కృతి మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా...