Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 2:23 pm Posted by : ramakrishna

పలు కుటుంబాలను పరామర్శించిన గణేష్ బిగాల

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 

 

నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల సోమవారం పలు కుటుంబాలను పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు. నగరంలోని బీ ఆర్ ఎస్ 21వ డివిజన్ నాయకుడు న్యాలం రమేష్  తండ్రి ఇటీవల మరణించగా వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అలాగే 16వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పంచరెడ్డి సురేష్ మరణించగా వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. మాక్లూర్ సర్పంచ్ వెంకటేష్ రావు మాతృమూర్తి ఇటీవల మరణించగా, వారిని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా గణేష్ బిగాల  మాట్లాడుతూ, ఇలాంటి విషాద సమయంలో కుటుంబాలకు అండగా నిలబడటం మన బాధ్యత అని పేర్కొన్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

Ganesh Bigala visited several families