గిరిరాజ్ కళాశాలలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలోని గాంధీ విగ్రహానికి శుక్రవారం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామ్మోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జీవితం, ఆదర్శాలు నేటి తరానికి మార్గదర్శకమన్నారు. వైస్ ప్రిన్సిపాల్ ప్రొ.రంగరత్నం మాట్లాడుతూ గాంధీ బోధించిన సత్యం, అహింస, నైతిక విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. చరిత్ర విభాగం అధ్యాపకులు రమేష్ గౌడ్ మాట్లాడుతూ భారత...