నిజామాబాద్, బతుకమ్మ:
మహాత్మా గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి ల జయంతి సందర్భంగా కాంగ్రెస్ భవన్ లో వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తిలక్ గార్డెన్ వద్ద గల లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి,గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహానికి నుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేశ వేణు మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్ర్యం తీసుకు రావడానికి మహాత్మా గాంధీ ఎంతో కృషి చేయడం జరిగిందని ,ఉప్పు సత్యాగ్రహం వంటి ఎన్నో ఉద్యమాలు చేసి శాంతి, అహింస ద్వారా ఉద్యమాన్ని ముందుక నడిపిన గొప్ప నాయకుడని,స్వాతంత్ర్యం సిద్ధించడంలో ఎంతో మంది మహానుభావులు ఉంటే అందులో మొదటి వరుసలో గాంధీ గారు వున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్,జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి,జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి,మీసాల సుధాకర్ రావు,బంటు బలరాం, ప్రమోద్, ప్రీతం, వినయ్, సుభాష్ జాదవ్, మెయిన్, సలీం, ముశ్షు పటేల్ తదితరులు పాల్గొన్నారు.
