Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 February 2025, 10:57 pm Posted by : ramakrishna

గేమింగ్ సెంటర్లు కావవి . .  బెట్టింగ్ అడ్డాలు..

  • స్నూకర్, క్యారం అడ్డాలుగా ఆన్ లైన్ బెట్టింగ్
  • జిల్లా కేంద్రంలో జోరుగా దందా
  •  అనుమతులు లేకున్నా నడుస్తున్న గేమింగ్ సెంటర్లు
  • పోలీసు ఉన్నతాధికారి పేరు చెప్పి జరుగుతున్న వసూళ్లు

నిజామాబాద్, బతుకమ్మ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆటవిడుపు కేంద్రాలుగా ఉండాల్సిన స్నూకర్, క్యారం గేమింగ్ సెంటర్లు బెట్టింగ్ అడ్డాలుగా మారాయి. అక్కడ ఆన్ లైన్ బెట్టింగ్ దందాలకు అడ్డాగా మారాయి. గడిచిన వారం బోధన్ రోడ్డులో రషీద్ పార్లర్ వద్ద ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహించే గ్యాంగ్ యువకుడిపై రాడ్లతో దాడి చేసింది. ఈ విషయంపై బాధితుడి ఫిర్యాదు మేరకు స్థానిక 1వ టౌన్ పోలీస్ స్టేషన్ పై నలుగురిపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అరెస్టులు జరుగలేదు కానీ స్నూకర్ పార్లర్ వద్ద దాడి విషయం చర్చనీయాంశమైంది.
అయితే నగరంలో 5వ టౌన్ పరిధిలో క్యారం అడ్డాలు శాంతినగర్, ఖిల్లా రోడ్డులో ఉన్నాయి. నగరంలోని 1వ టౌన్ పరిధిలోని బోధన్ రోడ్డులో గల నటరాజ్ థియేటర్ వద్ద, ఫ్లవర్ హాస్పిటల్ వద్ద ములాఖత్ హోటల్ వద్ద స్నూకర్ పాయింట్లున్నాయి. వాటికి ఎలాంటి అనుమతి లేదు. పది నిమిషాల గేమ్ కోసం నిర్వాహకులు ఒక్కొక్కరి వద్ద వంద రూపాయల చొప్పున వసూల్ చేస్తున్నారు. నిత్యం లక్షల్లో జరిగే లావాదేవిల వ్యవహరం పోలీసులకు తెలిసినా ఎవరు అటువైపు కన్నెత్తి చూడరని చెప్పాలి. గతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు రెండు, మూడు సార్లు క్యారం, స్నూకర్ పాయింట్లపై దాడులు చేసినా తర్వాత కాలంలో మరిచిపోయారు. మరిచిపోయారు అనే కంటే పోలీసు పెద్ద సార్ చెప్పాడని సిఐలను, ఎస్సైలను బెదిరిస్తున్న ఘటనలున్నాయి. నిజామాబాద్ లో పని చేసిన అధికారి అండ ఉందని వారు రెచ్చిపోతున్నారు.
పేరుకు క్యారం, స్నూకర్ పాయింట్లుగా చెలామణి అవుతున్నా సెంటర్ల వద్ద ఆన్ లైన్ గేమింగ్ అడ్డాలుగా ఉన్నాయని చెప్పాలి. గతంలో ముజాహిద్ నగర్ కు చెందిన ఇర్ఫాన్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు షాక్ కు గురయ్యారు. అతనొక్కడే అరకోటికి పైగా లావాదేవిలు జరుపడంతో బ్యాంక్ ఖాతాలను యూపీఏ చెల్లింపులను గుర్తించి కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. కానీ మళ్ళీ ఆన్ లైన్ గేమింగ్ అంతటా జరుగుతుంది. ఇటీవల 1వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్యాయత్నం కేసు కూడా ఆన్ లైన్ గేమింగ్ గ్యాంగ్ నిర్వాహకుల మధ్య విభేదాలతోనే జరిగిందనేది జగమెరిగిన సత్యం. పోలీసు ఉన్నతాధికారి పేరు చెప్పి మామూళ్ళు ఇస్తున్నామని బహిరంగంగా చెబుతుంగా అక్కడ దాడులు జరుగకపోవడం క్యారం, స్నూకర్ పాయింట్లలో సకల సౌకర్యాలు ఉండడం అంతా నిజమేనన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆరోపణలు వస్తున్న స్పందించకపోవడం వెనుక మతలబు ఉందని చెప్పాలి.

Gaming centers. .  Betting barriers..