మానసిక ఉల్లాసానికి ఆటలు ఎంతో అవసరం
పీవైఎల్ జిల్లా అధ్యక్షులు వాసరి సాయినాథ్ నిజామాబాద్ అర్బన్,బతుకమ్మ : మానసిక ఉల్లాసానికి ఆటలు ఎంతో అవసరమని పీవైఎల్ జిల్లా అధ్యక్షులు వాసరి సాయినాథ్ అన్నారు. గన్ పూర్ గ్రామంలో సంక్రాంతి సెలవుల సందర్భంగా స్కిప్పింగ్, సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయినాథ్ మాట్లాడుతూ గ్రామంలో పిల్లలందరూ ఈ మధ్యకాలంలో ఫోన్లకు ఆకర్షతులు అయి ఫోన్లో గేమ్స్ ఆడుతున్నారని తెలిపారు. దాని వల్ల వారు మానసికంగా బలహీన పడుతున్నారని పేర్కొన్నారు. కొందరు డబ్బులను కూడ కోల్పోతున్నారని తెలిపారు. కావున వాళ్ళందరూ కూడా...