Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 January 2025, 8:55 pm Posted by : ramakrishna

మానసిక ఉల్లాసానికి ఆటలు ఎంతో అవసరం

  •  పీవైఎల్ జిల్లా అధ్యక్షులు వాసరి సాయినాథ్

 

నిజామాబాద్ అర్బన్,బతుకమ్మ :  మానసిక ఉల్లాసానికి ఆటలు ఎంతో అవసరమని పీవైఎల్ జిల్లా అధ్యక్షులు వాసరి సాయినాథ్ అన్నారు.  గన్ పూర్ గ్రామంలో సంక్రాంతి సెలవుల సందర్భంగా స్కిప్పింగ్, సైక్లింగ్ పోటీలు నిర్వహించారు.  ఈ సందర్భంగా సాయినాథ్ మాట్లాడుతూ గ్రామంలో పిల్లలందరూ ఈ మధ్యకాలంలో ఫోన్లకు ఆకర్షతులు అయి ఫోన్లో గేమ్స్ ఆడుతున్నారని తెలిపారు. దాని వల్ల వారు మానసికంగా బలహీన పడుతున్నారని పేర్కొన్నారు.  కొందరు డబ్బులను కూడ కోల్పోతున్నారని తెలిపారు. కావున వాళ్ళందరూ కూడా ఆటల వైపు మళ్లించాలని ఉద్దేశంతోటి ఈ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు.1 నుంచి 10వ తరగతి గర్ల్స్ కు స్కిప్పింగ్, బాయ్స్ స్లో సైకిలింగ్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. మొదటి బహుమతి స్కూల్ బ్యాగ్, రెండవ బహుమతి లంచ్ బాక్స్ బ్యాగ్, మూడవ బహుమతి జామెటరీ కంపక్స్ బాక్స్, పాల్గొన్న వారందరికీ పెన్, చాకలే్ట్ బహుమతులు అందజేశామని తెలిపారు.  ఈ కార్యక్రమం లో గ్రామభివృద్ధి కమిటీ సభ్యులు, బి. గంగదాస్, బి. కృష్ణ,హరీష్, సంతోష్,ప్రకాష్,వి.దేవిదాస్ సెట్, డి. సతీష్,బి.వివేక్,కె.రమణ తదితరులు పాల్గొన్నారు.

Games are essential for mental entertainment