Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 7:19 pm Posted by : ramakrishna

లింగంపేటలో జూదరుల అరెస్టు

 

. . . నగదు, బైక్‌ లు స్వాధీనం

 

లింగంపేట, బతుకమ్మ:

 

లింగంపేట మండల కేంద్రంలోని మత్తడి పోచమ్మ ఆలయం సమీపంలోని పెద్దవాగు పరిసరాల్లో జూదం ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను స్థానిక పోలీసులు పట్టుకున్నారు. లింగంపేట ఎస్సై దీపక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం ఆలయ పరిసరాల్లో జూదం ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి ఏడుగురు పేకాటరాయలను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వారి వద్ద నుండి రూ.2,500 నగదుతో పాటు మూడు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్‌ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మండలంలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు సాగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.