త్రివేణి సంగమంలో ఒకరి గల్లంతు

రెంజల్, బతుకమ్మ: కందకుర్తి త్రివేణి సంగమంలో పుణ్య స్నానానికి వచ్చిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కోటగిరి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మక్కయ్య (60), సాయిబాబా(35) రెంజల్ మండలం కందకుర్తికి వచ్చి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేస్తుండగా సాయిబాబా గల్లంతయ్యాడు. మక్కయ్య వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.