నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 34వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలని ఆశిస్తూ గాలి ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం అధికారికంగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణను కలిసి, పార్టీ టికెట్ మంజూరు చేయాలని కోరుతూ అప్లికేషన్ సమర్పించారు. పార్టీ బలోపేతం కోసం, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని గాలి ప్రసాద్ ఈ సందర్భంగా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తనవంతు బాధ్యత నిర్వర్తిస్తానని ఆయన పేర్కొన్నారు. 34వ డివిజన్ ప్రజల మద్దతుతో గెలుపు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.