. . . పోలీస్ స్టేషన్ లో రైతు పై ఆకారణంగా దాడి ఎఫెక్ట్
గజ్వెల్, బతుకమ్మ :
గజ్వేల్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధుల్లో ఉన్న ఎస్ఐ మల్లా రెడ్డిని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసారు. శనివారం పోలీస్ స్టేషన్ లో యువ రైతుపై ఎస్ఐ మల్లారెడ్డి దారుణంగా దాడి చేశారు. తన సమస్య చెప్పుకునేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన భీమరి రవి అనే రైతును గజ్వేల్ ఎస్ఐ మల్లారెడ్డి రక్తం వచ్చేలా కొట్టారు. కరెంటు ఎప్పుడు వస్తుందని ఎస్ఐ అడిగితే, తనకు తెలియదని సమాధానం ఇచ్చిన రవిని మరి పీకడానికి వ్యవసాయం చేస్తున్నావా అంటూ రవిని కొట్టడంతో తలకు గాయాలయ్యాయి. ఆసుపత్రికి కూడా తీసుకెళ్లకుండా స్టేషన్‌లోనే కూర్చోబెట్టాడంపై రైతు ఆవేదన వ్యక్తం చేసారు. సంబంధిత వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయింది. దానితో ఎస్ఐ మల్లారెడ్డి పై వేటు వేసి హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేసారు.