Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 9:10 pm Posted by : ramakrishna

పది ఫలితాల్లో జిల్లా స్థాయి ర్యాంక్ సాధించిన గజేల్వర్ సాత్విక

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మాదాపూర్ హంగార్గ గ్రామానికి చెందిన గజేల్వర్ సాత్విక త్రివేణి విద్యాసంస్థలో చింతల్ లో పదవతరగతి వరకు చదువుకుని, జిల్లా స్థాయి మార్కులు 562/600 సాధించింది. తల్లితండ్రులు గజేల్వర్ గంగామణి సంతోష్ లు ప్రైవేట్ విద్యాసంస్థలో టీచింగ్ వృత్తి లో ఉండడం వల్ల విద్యార్థినికి విద్యలో చాలామేరకు వారి ప్రొద్బలం తోడై… విద్యార్థిని సాత్విక మంచి మార్కులు సాధించడానికి తోడ్పడిందన్నారు. సాత్విక నా కృషికి అన్ని రకాలుగా శ్రమించి తొడ్పాటును అందించిన నా గురువులకు, నా తల్లితండ్రులకు కృతజ్ఞతలు తెలియజేసింది.

 

Gajeelvar Sattwika secured district level rank in ten results