జి.జి. కళాశాల తెలుగు విభాగం జాతీయ సదస్సు కరపత్రం విడుదల
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : మార్చి 6న జరగబోయే తెలుగు విభాగం జాతీయ సదస్సు కర పత్రాన్ని ప్రిన్సిపాల్ పి. రామ్మోహన్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “తెలుగు మాండలిక సాహిత్య వికాసం; విస్తృతి, వైవిధ్యం” అనే అంశంపై రూసా ఆర్థిక సౌజన్యంతో, జి.జి. కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుపబోతున్నట్లు ఆయన తెలిపారు. భాషలకు సహజ రూపం మాండలికమేనని, వివిధ మాండలికాలతో వెలువడిన సాహిత్యాన్ని, ప్రక్రియలను అధ్యయనం చేసే ఉద్దేశ్యంతో సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు....