Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 January 2026, 4:43 pm Posted by : ramakrishna

జి.జి. కళాశాల తెలుగు విభాగం జాతీయ సదస్సు కరపత్రం విడుదల

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మార్చి 6న జరగబోయే తెలుగు విభాగం జాతీయ సదస్సు కర పత్రాన్ని ప్రిన్సిపాల్ పి. రామ్మోహన్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “తెలుగు మాండలిక సాహిత్య వికాసం; విస్తృతి, వైవిధ్యం” అనే అంశంపై రూసా ఆర్థిక సౌజన్యంతో, జి.జి. కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుపబోతున్నట్లు ఆయన తెలిపారు. భాషలకు సహజ రూపం మాండలికమేనని, వివిధ మాండలికాలతో వెలువడిన సాహిత్యాన్ని, ప్రక్రియలను అధ్యయనం చేసే ఉద్దేశ్యంతో సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డా.ఎస్.రంగరత్నం, సదస్సు కన్వీనర్ లెఫ్టినెంట్ డా.రామస్వామి, అకాడమిక్ కోఆర్డినేటర్ నహీదబేగం, ఐ.క్యూ.ఏ.సి. కోఆర్డినేటర్ డా.రాజేష్, పి.ఆర్.ఓ డా.దండు స్వామి, కామర్స్, బి.బి.ఏ అధిపతులు డా.వినయ్ కుమార్, డా.రంజిత, డా.ముత్తెన్న, డా.చంద్రశేఖర్, రమేష్ గౌడ్, రాహుల్, సుభాషిణి దేవి, రామకృష్ణ, పూర్ణచందర్ రావు, బాలమణి, శమంత, గంగాధర్, రాజేశ్వర్, శ్రీనివాస్, అర్చన, కార్యాలయ సిబ్బంది ఏఓ. రామ్ కిషన్, సూపరిండెంట్ ఉదయభాస్కర్,  విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

 

G.G. College Telugu Department National Conference Brochure Released