Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 April 2026, 9:00 pm Posted by : ramakrishna

హైదరాబాద్ ను ప్రపంచానికి గేట్ వే గా మార్చేది ఫ్యూచర్ సిటీ

 

. . . సీఎం రేవంత్ రెడ్డి

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

హైదరాబాద్ ను ప్రపంచానికి గేట్ వే గా మార్చే నగరం ప్రజా ప్రభుత్వం నిర్మించబోయే ఫ్యూచర్ సిటీ అని తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్ పేట్ లో “ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్” నూతన భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ప్రజల సహకారం, రైతుల త్యాగాలతో అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తామని, నూతన నగర నిర్మాణంలో నష్టపోతున్న ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత నాదని, సామాన్యులు, పేదల విషయంలో అధికారులు మానవీయ కోణంలో ఆలోచన చేయాలన్నారు.

 

Future City is transforming Hyderabad into a gateway to the world

 

ఇక ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు మల్కాజ్ గిరి కమిషనరేట్ భవనం, అక్టోపస్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, కుత్బుల్లాపూర్ డిసిపీ కార్యాలయ భవనాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, డి.శ్రీధర్ బాబు, శాసన మండలిలో చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, అనీల్ కుమార్ యాదవ్, శాసన సభ్యుడు మల్ రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Future City is transforming Hyderabad into a gateway to the world