Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 January 2026, 8:10 pm Posted by : ramakrishna

ఫ్యూజన్ ఫార్మా కెమికల్ నిర్మాణం పనులను నిలిపివేయాలి

. . . ప్రజావాణిలో ఫిర్యాదు

 

బతుకమ్మ భిక్కనూరు :

 

భిక్కనూరు మండల కేంద్రంలో నిర్మిస్తున్నటువంటి ఫ్యూజన్ కెమికల్ నిర్మాణ పనులు వెంటనే నిలిపివేయని సోమవారం వార్డు సభ్యుడు రాజు ఆర్టిఐ ప్రతినిధి గంగల రవీందర్ ప్రజావాణిలో సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనావాసాల మధ్య కెమికల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తే జల వాయు కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని భూగర్భ జలాలు కలుషితం వ్యవసాయం దెబ్బతినడమే కాకుండా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.ఎట్టి పరిస్థితుల్లో కెమికల్ పరిశ్రమ నిర్మాణ పనులు నిలిపివేయాలని లేని పక్షంలో 18 గ్రామాల ప్రజలు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.