Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 February 2025, 4:04 pm Posted by : ramakrishna

రైల్వే కనెక్టివిటీ పెరిగితే మరిత అభివృద్ధి

  • నిజామాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డిస్టిక్ ప్రెసిడెంట్ ఆర్.జగదీశ్వరరావు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న నగరాలలో మొదట వరుసలో ఉంది అని ఐతే ఇక్కడ రైల్వే కనెక్టివిటీ పెరిగితే మరిత శరవేగంగా అభివృద్ధి చెందుతుంది అని నిజామాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డిస్టిక్ ప్రెసిడెంట్ ఆర్.జగదీశ్వరరావు అన్నారు.  ఈ అన్యువల్ సేఫ్టీ ఇన్స్పెక్షన్ లో భాగంగా నిజామాబాద్ రైల్వే స్టేషన్ ని సందర్శించడానికి వచ్చిన సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, డిఆర్ యం. లోకేష్ వైస్నోయిని కలసి బుధవారం వినతి పత్రం అందజేశారు.  అధ్యక్షుడు జగదీశ్వర్ రావు మాట్లాడుతూ.. రైల్వే ట్రాక్ డబ్లింగ్, ప్లాట్ ఫామ్ లో విస్తరణ, మధ్యాహ్నం పీక్ హావర్స్ టైములో హైదరాబాద్, ముంబై వైపు ట్రైన్ వేయాలని కోరారు. అదే విధంగా ధర్మబాద్ లో పార్కింగ్ చేస్తున్న రైళ్ళని నిజామాబాదు వరకు నడపాలని, వందేభారత్ రైళ్లని ఇక్కడి వరకు పొడిగించాలని అన్నారు.  ఉత్తరభారత్ పట్టణాలను కలుపుతూ రైళ్ళని నిజామాబాదు మీదుగా నడపాలని సూచించారు. గూడ్స్ షెడ్ ని వేరే చోటికి తరలించాలని, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ సమస్యలు పరిష్కరించి వ్యాపారస్థులను ఆదుకోవాలని అన్నారు. అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిలను త్వరితగతిగా పూర్తి చేయాలనీ, నిజామాబాదు స్టేషన్ సర్వంగా సుందరంగా తీర్చిదిదాలని కోరారు. పసుపు, వరి రైతులకు సులభంగా తమ పంటను మార్కెట్ కి తరలించడానికి సహకరించాలని కోరారు.  రైల్వే బ్రిడ్జి మరియు డబ్లింగ్ పూర్తయితే పైన తెలిపిన అన్ని సమస్యలు పరిష్కరిస్తామని సానుకూలంగా స్పందిస్తూ హామీ ఇచ్చారని తెలిపారు.  ఈ కార్యక్రమంలో కార్యదర్శి కమల్ ఇనాని, సభ్యులు శ్రీనివాస్ రావు, గంగాధర్ రావు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Further development if railway connectivity is increased