నందిపేట్, బతుకమ్మ: నందిపేట్ మండలం చింరాజ్పల్లి,లక్కంపల్లి,తల్బేద గ్రామాల రోడ్డు విస్తరణ పనులకు రూ.6.93కోట్లు విడుదలయ్యాయి. రోడ్డు ప్రమదాలు జరుగుతున్నాయని మూడు గ్రామాల వి డి సి సభ్యులు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి కి విన్నవించారు. ఆయన వెంటనే స్పందించి ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు. వెంటనే స్పందించిన మంత్రి 6 కోట్ల 93 లక్షల రూపాయలు మంజూరు చేయాలి అని అధికారులకు ఆదేశాల జారీచేసారు. నిధుల మంజూరు తో గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తు నిధులు మంజూరు కు సహకరించిన జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి లకు ధన్యవాదాల తెలియజేశారు. వారం రోజుల్లో పనులు ప్రారంభం భూమిపూజ కార్యక్రమం ఉంటుందని మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ తెలిపారు. ఈ కార్యక్రమం లో బైండ్ల ప్రశాంత్, గంగయ్య, గంగారెడ్డి, సిరిగిరి శ్రీను, ద్యావతి ముత్యం, రాజశేఖర్, గాదె శ్రీను, మన్నె సాగర్, బ్యాగరి జీవన్, గ్రామాల పెద్దమనుషులు తదితరులు పాల్గొన్నారు.