Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 June 2025, 5:55 pm Posted by : ramakrishna

కుల సంఘ భవనాలకు నిధులు మంజూరు

బతుకమ్మ,ఏర్గట్ల: మండలకేంద్రంలోని పద్మశాలి సంఘం,బర్మ చిన్న సంఘం,కూరకుల సంఘం, గుండ్ల సంఘం,ఎస్ సి మాదిగ సంఘాలకు ఎస్ డి ఎఫ్ నిధుల నుండి 18 లక్షల రూపాయలు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మోర్తాడ్ లోని ప్రజానిలయంలో ప్రొసీడింగ్ కాపీలను వివిధ కుల సంఘ సభ్యులకు అందజేశారు. ఏర్గట్ల మండల కేంద్రంలో మిగతా సంఘాలకు నిధులు కావాలని, గ్రామ పరిధిలో ప్రభుత్వం అందించే పథకాలకు అర్హుల అయినచో  వారికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయానికి మంజూరు పత్రాలను ఇప్పించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్, విన్నవించగా ముత్యాల సునీల్ కుమార్  సానుకులముగా స్పందించారని తెలిపారు. ఈ సందర్భంగా ముత్యాల సునీల్ కుమార్ ను వివిధ కుల సంఘ సభ్యులు శాలువాతో  సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోల్ల శివకుమార్,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సోమా దేవరెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి, కూరాకుల బోర్రన్న,దండవోయిన సాయి,గ్రామశాఖ నాయకులు,మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.