ఎల్లారెడ్డి, బతుకమ్మ :
నాగిరెడ్డిపేట్ మండలంలోని ఎమ్మార్వో కార్యాలయం శిథిలావస్థలో ఉండటంతో నూతన భవన నిర్మాణం కోసం రూ.2.25 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడైంది. ఈ నిధుల మంజూరుకు కృషి చేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు కాంగ్రెస్ పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నాగిరెడ్డిపేట్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు పాలాభిషేకం నిర్వహించారు. మండల ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి ఎమ్మెల్యే నిరంతరం కృషి చేస్తున్నారని నాయకులు కొనియాడారు. నూతన ఎమ్మార్వో కార్యాలయ భవనం నిర్మాణం పూర్తయితే ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందుబాటులోకి వస్తాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.