Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 7:25 pm Posted by : ramakrishna

అర్వింద్ పట్టుదలతోనే ఆర్వోబికి నిధులు

 

. . . ఆర్వోబి వద్ద ఎంపీ అర్వింద్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :

 

నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి పట్టుదలతోనే మాదవనగర్ ఆర్ వోబికి నిధులు వచ్చాయని బీజేపీ మున్సిపల్ కార్పేరేషన్ ఫ్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్ అన్నారు. మాదవనగర్ ఆర్వోబికి నిధుల విడుదలకు అడ్మిస్ట్రేషన్ అనుమతులు మంజూరు అయిన నేపథ్యంలో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. మంగళవారం ఆర్వోబి వద్ద ఎంపీ అర్వింద్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ నిజామాబాద్ నగరానికి ఇబ్బందికరంగా ఉన్న మాదవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఎంపీ అర్వింద్ కంకణం కట్టుకున్నాడని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం పట్టుబట్టి ప్రభుత్వం విడుదల చేయించడంలో ఆయన పట్టుదల ఎంతో ఉందన్నారు. ఇప్పటి వరకు రెండుసార్లు మాదవనగర్ ఆర్వోబి వద్ద నిధుల కోసం బీజేపీ ఆందోళన చేసినప్పుడే నిధుల విడుదల జరిగిందని గుర్తు చేశారు. ఇటీవల ఆర్వోబి వద్ద బీజేపీ నాయకత్వం అంతా ఆందోళన చేయడంతోనే ఈరోజు పరిపాలనపరమైన అనుమతులను జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నరేష్, ఎర్రం సుధీర్,  బీజేపీ నాయకులు చిరంజీవి తదితరులున్నారు.