Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 August 2025, 5:31 pm Posted by : ramakrishna

లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ

  • ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్

 

గాంధారి, బతుకమ్మ : నియోజకవర్గవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని, బిల్లులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నాయని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. గాంధారి మండలంలో ఆయన హై మాక్స్ లైట్ల ప్రారంభించి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.  ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేయడం లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం గ్రామ పంచాయతీ సెక్రటరీలతో మీటింగ్‌లు నిర్వహించి పనుల పురోగతిపై నివేదికలు తీసుకుంటున్నాన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో పేద ప్రజల సొంత ఇంటి కల సాకారం అవుతుందన్నారు. మరిన్ని ఇళ్లు మంజూరు కావడానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ కృషి చేస్తాను” అని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గాంధారి ఏఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ లు, గాంధారి పట్టణ అధ్యక్షులు, మండల సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గండివేట్ గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Funds are deposited into the bank accounts of the beneficiaries