Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 November 2024, 3:24 pm Posted by : ramakrishna

పద్మశాలీ కళ్యాణ మండపం ప్రారంభోత్సవంలో నిధుల లోల్లి

. . . ఈరవత్రి అనిల్ ముందే నిధుల ఖర్చు విషయంలో పంచాయతీ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ  :

నిజామాబాద్ నగర పద్మశాలీ కళ్యాణ మండపం పున: ప్రారంభం కార్యక్రమంలో పాత, కోత్త అధ్యక్షుల మద్య నిధుల ఖర్చు లోల్లి జరిగింది. పద్మశాలీ కళ్యాణ మండపం ప్రారంబానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఈరవత్రి అనిల్ వేదిక పై మాట్లాడుతుండగా పూర్వ అధ్యక్షుడు సత్యపాల్, ప్రస్తుత అధ్యక్షుడు వెంకట నరసయ్య మధ్య నిధుల విషయంలో  మాట మాట పెరిగింది. కళ్యాణ మండపం పున: ప్రారంబించాడానికి గతంలో అధ్యక్షుడిగా పని చేసిన సత్యపాల్ ను వేదికపైకి అహ్వనించలేదు. ఈరవత్రి అనిల్ జోక్యం చేసుకుని పైకి పిలిపించారు. అప్పుడు ఇరవత్రి అనిల్ ముందే సత్యపాల్ మాట్లాడుతూ తన తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భవన నిర్మాణం కోసం గత ప్రభుత్వం నుండి 50 లక్షలు మంజూరు చేయించడం జరిగిందని అవి సరిపోక పోవడంతో అప్పటి ఎమ్మెల్యే తో పాటు ఇతరాత్రంగా మరో కోటి రూపాయలు కూడామంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. అయితే ప్రస్తుత అధ్యక్షుడు వెంకట నరసయ్య భవన నిర్మాణం కాంట్రాక్ట్ తీసుకొని కోటి రూపాయల ఖర్చు లెక్కలు చెప్పకుండా కాలం గడుపుతున్నారని ఇరవత్రి అనిల్ కు ఫిర్యాదు చేశారు. పద్మశాలీలు ఐక్యంగా ఉండాలని ఓకవైపు ముఖ్య అతిథి మాట్లాడుతుండగా నిధుల ఖర్చు వివాధం జరుగడం కోసమెరుపు.

Fundraiser at the inauguration of Padmashali Kalyana Mandap