వ్యవసాయ అనుబంధ రంగాలకు నిధులు ఇవ్వాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వ్యవసాయ అనుబంధ రంగాలకు తగిన నిధులు ఇవ్వాలని, రైతంగా సమస్యలు పరిష్కరించాలని 18న జరిగే రైతు ధర్నాను విజయవంతం చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. జిల్లా కేంద్రంలో గల ద్వారక నగర్ ఐఎప్టీయూ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భూమయ్య మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నాయన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలుకు కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. నమ్మిన రైతన్నను నట్టెట్లా ముంచుతున్నారని, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి...