Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 October 2024, 2:04 pm Posted by : ramakrishna

మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు

బాన్సువాడ, బతుకమ్మ: గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని రాష్ర్ట ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నస్రుల్లాబాద్ మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి సోమవారం కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి పోచారం భూమి పూజ చేశారు. అనంతరం విజయకృష్ణ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఇక్బాల్, యూసుఫ్, పెర్క శ్రీను , కంది మల్లేశ్, శ్యామల, మాజీద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 Funding for infrastructure development