Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 August 2025, 7:55 pm Posted by : ramakrishna

సాగర్ తీరంలో సరదాగా..

మెండోరా. బతుకమ్మ : ఆదివారం సెలవు రోజు కావడంతో ఆటవిడుపుగా సాగర తీరంలో సరదాగా గడపడానికి పర్యాటకులు అధిక సంఖ్యలో రావడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పర్యాటక శోభ సంతరించుకుంది. సాగర తీరంలో చల్లగాలికి మొక్కజొన్న తింటూ యువకులు, నీటి దగ్గర ఫోటోలు సెల్ఫీలు దిగుతూ పర్యాటకులు చిన్న పెద్ద తేడా లేకుండా సంతోషంగా గడిపారు. ప్రాజెక్టు జిలకర సంతరించుకోవడంతో నిర్మల్, అదిలాబాద్, నిజామాబాద్ తదితర జిల్లాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ప్రాజెక్టు అందాలను జల దృశ్యాలను చూస్తూ సంతోషంగా గడుపుతున్నారు.

Fun on the shores of Sagar..