ఇసుక అక్రమ రవాణాకు ఫుల్ క్లియరెన్స్

. . .  అధికారులే దగ్గరుండి హద్ధులు దాటిస్తున్నారు బతుకమ్మ: బిచ్కుంద కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని హాస్గుల్ గ్రామంలోని మంజీరా పరివాహక ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా మూడు పువ్వులు, ఆరు కాయల్లా సాగుతోంది. రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా అక్రమార్కులు ఇసుక రవాణా చేస్తున్నారు. మండల కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ అధికారులు మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరించడం, రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టడంతో వారు పట్టించుకోవడం లేదని ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఆయా శాఖల...