ఆర్మూర్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా హ్యూమన్ రైట్స్ అధ్యక్ష ఉపాధ్యక్షులు ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి 1948 డిసెంబర్ 10న విశ్వ మానవ హక్కుల ప్రకటనను ఆమోదించడం వలన ప్రతి ఏడాది డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటారని అన్నారు. మానవ హక్కులు ప్రతి ఒక్కరు స్వేచ్ఛలు, సమానత్వం, న్యాయం కోసం మానవ హక్కుల ప్రాముఖ్యతను పేర్కొన్నారు. అంతేకాకుండా మానవ హక్కులు మన అందరికీ చెందినవి. జాతి తో సంబంధం లేకుండా మానవులు తమ యొక్క వ్యక్తిత్వాన్ని ఇతరుల యొక్క స్వేచ్ఛకు భంగం కలగకుండా ఉండేందుకే ప్రతి ఒక్కరికి మానవ హక్కుల యొక్క ఉల్లంఘనకు సంబంధించిన నైతిక విలువలను తెలుసుకోవాలని, మానవ హక్కుల ఉల్లంఘనకు గురి అయితే కోర్టులతో పాటు మానవ హక్కుల కమిషన్ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు అనీఫ్, వినోద్ పాల్గొన్నారు.
