వేల్పూర్, బతుకమ్మ : మండలంలోని శ్రీగోవిందసాయి దివ్య యోగాశ్రమంలో నేటి నుండి ఈ నెల 10 వరకు అఖండ హరినామ సప్తః స్మరణ(సప్తః భజన)ను నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, కార్యక్రమ నిర్వాహకులు కంకణాల రాజేశ్వర్, కొండ అశోక్ గౌడ్ లు బుధవారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ సప్తఃస్మరణ కార్యక్రమం ఈ ఆలయ ప్రాంగాణంలో గత నాలుగు సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుందని, సప్తః స్మరణ భజన కార్యక్రమంకు అన్ని గ్రామాల భజన మండలుల భక్తులు హాజరు కావాలెనని వారు కోరారు.ఈ కార్యక్రమం కార్యక్రమ ముఖ్య అతిథి బెంగళూర్ కు చెందిన శ్రీరాఘవేంద్ర స్వామి అమృత హాస్తాలతో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం స్వామి వారు సరస్వతి వీణ ధరించి సామూహిక ఆధ్యాత్మిక సప్తః భజన చేస్తారని తెలిపారు. ఏడు రోజులు కొనసాగే ఈ సప్తః సందర్బంగా రోజు గురుపాదుక పూజోత్సవం నిర్వహిస్తారని రాఘవేంద్ర స్వామి ఆధ్యాత్మిక ప్రసంగం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో భక్తులకు ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు.