Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 January 2025, 7:37 pm Posted by : ramakrishna

అంట్లుతోమే స్థాయి నుండి అంతరిక్షానికి వెళ్ళే స్థాయికి

  • అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మహిళలు అంట్లుతోమే స్థాయి నుంచి అంతరిక్షానికి వెళ్లే స్థాయికి ఎదిగారని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. మహిళా శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవం శుక్రవారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.  ఆడపిల్లలు, మహిళలు అంటే గతం లో చిన్న చూపు చూసే వారని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వాలు ఆడపిల్లల, మహిళల సంక్షేమానికి అనేక పథకాలు ప్రారంభించడం వల్ల అంట్లు తోమే  స్థాయి నుండి అంతరిక్షానికి వెళ్ళే స్థాయి వరకు ఎదిగారని తెలిపారు.

From the level of teeth to the level of going to space

బాల్య  వివాహాలు అరికట్టడంలో సమన్వయం తో పని చేయాలని అన్నారు. నగర మేయర్ దండు నీతూ కిరణ్ మాట్లాడుతూ ఆడపిల్లలు మహిళలు ఎదగడానికి కుటుంబ సభ్యుల సహాకారం చాలా అవసరం అని అన్నారు. మహిళా కమిషన్ మెంబర్ సుదాం లక్ష్మీ మాట్లాడుతూ పిల్లలకు ఫోన్ లు దూరంగా పెట్టాలని అన్నారు.  జిల్లా సంక్షేమ అధికారి యస్ కే రసూల్ బి మాట్లాడుతూ యునిసెఫ్ నివేదిక ప్రకారం 18 సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలకు 40శాతం పెళ్ళిళ్ళు జరుగుతున్నాయని, 15  సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలకు 12శాతం పెళ్ళిళ్ళు జరుగుతున్నాయని, 25  సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలకు 30శాతం మాత్రమే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయని దీనిని పెంచాలని అన్నారు.   డి యం అండ్ హెచ్ వో రాజశ్రీ మాట్లాడుతూ ఆరోగ్య శాఖా ఆధ్వర్యంలో లింగ నిర్ధారణ పరీక్షలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమములో అల్ ఇండియా రేడియొ డిడి మోహన్ దాస్, జిఈసిఓ భాగ్యలక్ష్మి, డిఎంసి మాధవి, సిడిపివోలు, సూపర్ వైజర్, వెంకటేశ్వర్, హెల్త్ డిపార్ట్మెంట్,  డి హెచ్ ఈ డబ్ల్యూ డీఎంసీ స్వప్న, సౌమ్య, పుష్ప, కవిత, ఆదిత్య, ఉదయ్, డిసిపిఓ చైతన్య, ఐసిపి యస సిబ్బంది, సఖి, పోషణ్ అభియాన్ పాల్గొన్నారు.

From the level of teeth to the level of going to space